Attack by elephants: ఏనుగులు దాడి చేసిన ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పెద్ద పంజానీ మండలం పెద్దకాపుపల్లి పంచాయతీ జిట్టంవారిపల్లి చోటు చేసుకుంది. ఈ దాడిలో పశువుల కాపరి అయిన గంగయ్య (70) అనే వృద్ధుడు మృతి చెందాడు. ముందుగా పంట పొలాలపై దాడికి దిగిన సుమారు 12 ఏనుగులు ఆక్కడే పశువులను మేపుతున్న గంగయ్యపై దాడి చేశాయి.
ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి, భయాందోళనలో గ్రామస్థులు - trampled to death by elephants
Attack by elephants in Chittoor: అటవీ జంతువులు దాడి చేసిన ఘటనలు తరుచూ వార్తల్లో చూస్తునే ఉన్నాం. అటవీలో ఉండాల్సిన జంతువులు జనవాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. పశువులను మేపడానికి వెళ్లిన వృద్ధుడిపై ఏనుగుల గుంపు దాడి చేయగా.. అతను అక్కడికక్కడే మరణించాడు.
ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి
వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడిన గంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు ఏనుగులను అడవిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందడంతో స్థానికుల్లో భయాందోళనలు మెుదలయ్యాయి.
ఇవీ చదంవడి: