గజరాజు ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో అదుపుచెయ్యలేక ఆ గజరాజునే గుద్దింది కారు. ఏనుగు పరిస్థితి తెలియకపోయినా ఆ కారు మాత్రం నుజ్జునుజ్జయింది.మద్ద ఓ ఏనుగును కారు ఢీకొంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి చిత్తూరు వెళ్తున్నారు కారులోని వారు. రోడ్డు దాటుతున్న గజరాజును వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలంచారు. ఏనుగు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.
చీకట్లో రోడ్డుపై ఏనుగును గుద్ది.. నుజ్జు నుజ్జైన కారు
వన్యప్రాణులు దారి తప్పి జనవాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. అలా రోడ్లపై పులులు, సింహాలు సైతం దర్శనమిస్తున్నాయి. అధికారులు వాటిని అటవీలోకి పంపించడానికి అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. అలాంటి ఘటనే చిత్తూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఏనుగు ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో అదుపుచెయ్యలేక ఆ గజరాజునే గుద్దింది కారు. ఏనుగు పరిస్థితి తెలియకపోయినా ఆ కారు మాత్రం నుజ్జునుజ్జయింది
ఏనుగు