చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం మద్దలకుంటలో విషాదం నెలకొంది. వ్యవసాయ బావిలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం రేపింది. మదనపల్లికి చెందిన గంగాధర(22) అత్తగారి ఊరు అయిన మద్దలకుంటకు రాగా.. నిన్న సాయంత్రం నుంచి తన భార్య సోనియా(19)తో కలిసి కనిపించకుండా వెళ్లిపోయాడు.
భర్తతో కలిసి ఎనిమిది నెలల గర్భిణి ఆత్మహత్య - ఎనిమిది నెలల గర్భవతి ఆత్మహత్య వార్తలు
ఏడాది క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు... ఆనందంగా గడిపారు. ఆమె గర్భం దాల్చటంతో ఎంతో సంతోషపడ్డారు. ఎనిమిది నెలలు రావటంతో.. ఇంకొన్ని రోజుల్లో ఓ చిట్టి అతిథి ఇంటికి రాబోతుందని అనుకున్నారు. ఇంతలో ఏమయ్యిందో ఏమో... కనిపించకుండా పోయారు. గ్రామస్థులు వెతకగా.. ఓ వ్యవసాయ బావిలో శవాలై తేలారు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా మద్దలకుంటలో జరిగింది.
భర్తతో కలిసి ఎనిమిది నెలల గర్భిణీ ఆత్మహత్య
దంపతుల కోసం గ్రామస్థులు వారి కోసం వెతకగా గ్రామంలోని వ్యవసాయ బావిలో మృతదేహాలను గుర్తించారు. ఏడాది క్రితం వీరిద్దరికీ వివాహం కాగా.. మృతురాలు ప్రస్తుతం 8 నెలల గర్భవతి. దంపతుల ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:ప్రేమ పెళ్లి గలాట: ఇరు వర్గాల ఘర్షణ.. 20 మందిపై కేసులు