తిరుమల నడకదారిలో ఏడడుగుల నాగుపాము భక్తులను భయబ్రాంతులకు గురిచేసింది. అలిపిరి కాలినడక మార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద భక్త సంచారంలోకి సర్పం ప్రవేశించింది. పామును చూసిన భక్తులు ఆందోళన చెంది భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. పాములు పట్టడంలో నిష్ణాతుడైన భాస్కర్ నాయుడు అనే వ్యక్తి అక్కడికి చేరుకొని.. విషసర్పాన్ని బంధించాడు. అనంతరం దట్టమైన అటవీ ప్రాంతంలో సర్పాన్ని వదిలారు.
తిరుమల నడకదారిలో... ఏడడుగుల నాగుపాము ! - అలిపిరి
సుమారు ఏడడుగుల నాగుపాము తిరుమల నడకదారిలో భక్తులను ఆందోళనకు గురి చేసింది. అలపిరి కాలినడక మార్గంలోకి వచ్చిన పామును చూసి భక్తులు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది పామును చాకచక్యంగా బంధించి అడవిలో వదలటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏడడుగల నాగుపాము