ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటిలో పడి నలుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు - kids died due to fell in water

నీటిలో పడి నలుగురు మృతి
నీటిలో పడి నలుగురు మృతి

By

Published : Feb 4, 2021, 1:54 PM IST

Updated : Feb 4, 2021, 3:37 PM IST

13:53 February 04

నీటిలో పడి నలుగురు మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

నీటిలో పడి నలుగురు మృతి

చిత్తూరు జిల్లా కుప్పం మండలం చింపనగల్లులో విషాదం నెలకొంది. దుస్తులు ఉతికేందుకు వెళ్లి నీటికుంటలో పడి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉదయం ఇంటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి రుక్మిణి అనే మహిళ దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. వీరితో పాటు సమీప బంధువు  గౌరమ్మ వెళ్లింది. నలుగురూ ఎంత సేపటికి ఇళ్లకు రాకపోయే సరికి ..ఆందోళనతో కుటుంబ సభ్యులు ఆ ప్రాంతమంతా గాలించారు. నీటి కుంటలో మృతదేహాలను చూసి బోరున విలపించారు.

ఒకరి వెంట ఒకరు..

రుక్మిణి, గౌరమ్మ బట్టలు ఉతుకుతున్న సమయంలో కీర్తి(6)ఆడుకుంటూ నీటిలో పడిపోయింది. చెల్లెలను బయటకు లాగేందుకు వెళ్లి అక్క హారతి(8) సైతం నీటి కుంటలో పడిపోయింది. దిగ్భ్రాంతికి లోనైన రుక్మిణి, గౌరమ్మలు  పిల్లలను బయటకు లాగేందుకు నీటిలోకి దిగి గోతుల్లో చిక్కుకుపోయి ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. 

ఇదీచదవండి:  మానసిక వైద్యశాలలో.. మదనపల్లె జంట హత్య కేసు నిందితులు

Last Updated : Feb 4, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details