చిత్తూరు జిల్లాలో రేణిగుంట బాలపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం ముఠాను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు.దాదాపు30మంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకొని వెళ్తుండగా,టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.దీంతో స్మగ్లర్లలో కొందరు దుంగలను కిందపడేసి పోలీసులపై రాళ్లు విసరుకుంటూ పారిపోయారు.ఈ ఘటనలో27ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవిశంకర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రేణిగుంట బాలపల్లి అడవిలో ఎర్ర స్మగ్లర్ల అలజడి - రేణిగుంట
చిత్తూరుజిల్లా రేణిగుంట బాలపల్లి అటవీ ప్రాంతంలో ఎదురుపడిన ఎర్రచందనం ముఠాను టాస్క్ఫోర్స్ సిబ్బంది అడ్డగించడంతో, దుంగలను పడేసి స్మగ్లర్లు పారిపోయారు.
27 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం...టాస్క్ఫోర్స్ సిబ్బంది