ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా.. తమిళ స్మగ్లర్​ అరెస్టు - latest red sandle wood smugglers arrest news in chittioor district

శేషాచల అడవులు ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా మారాయి. అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకోడానికి ఎంత ప్రయత్నిస్తున్నా వారికి భంగపాటు మాత్రం తప్పడం లేదు. తలకోన అటవీ ప్రాంతంలోని పులిగుండ్లు వద్ద ఎర్రచందనం అక్రమంగా తరలిస్తోన్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/12-December-2019/5350951_132_5350951_1576148850689.png
26 red sandalwoods seized in chittoor district

By

Published : Dec 12, 2019, 5:36 PM IST

Updated : Dec 13, 2019, 12:49 PM IST

పులిగుండ్లు వద్ద 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా యర్రావారి పాళ్యం మండలంలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. తలకోన అటవీప్రాంతంలోని పులిగుండ్లు వద్ద అక్రమంగా తరలిస్తోన్న 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ తమిళ స్మగ్లర్​ను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది అడవిలోకి పారిపోయారు. నిందితుడి వద్ద ఓ చంపిన అడవి ప్రాణిని గుర్తించారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం సమీప ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు.

Last Updated : Dec 13, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details