చిత్తూరు జిల్లాలో వడమాలపేట చెక్‌పోస్ట్ వద్ద టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. చెన్నై నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ లారీలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న 25 మంది తమిళనాడు వాసులను విచారించారు. వారితో పాటు 75 కిలోల బియ్యం, పప్పు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులు ఉన్నాయి. దీంతో లారీతో పాటు 25 మందిని తిరుపతి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. ఎర్రచందనం కోసం శేషాచలం అటవీప్రాంతంలోకి వెళ్లడానికి ఆహార పదార్థాలతో వస్తునట్లు విచారణలో గుర్తించారు.
అదుపులోకి తీసుకొన్న వారిలో... అటవీశాఖ అధికారులు హత్య కేసులో నిందితుడు అర్జున్ ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వడమాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు... స్థానిక పోలీసులతో కలిసి పూర్తిస్థాయి విచారణ నిర్వహించనున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఎస్పీ తెలిపారు.
రూటు మార్చిన స్మగ్లర్లు..