చిత్తూరు జిల్లా దేవరకొండ అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న 22 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11 ఎర్రచందనం దుంగలతోపాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరించారు. అటవీ సమీప గ్రామాల్లో ఎవరైనా..అనుమానస్పదంగా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
చిత్తూరులో 22 మంది స్మగ్లర్ల అరెస్ట్ - smugglers arrested in Chittoor
శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా దేవరకొండ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు.
స్మగ్లర్ల అరెస్ట్