శేషాచలం అడవులలో 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం - smaglars arrest in sheshachalam forest
చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో అక్రమంగా తరలిస్తున్న 21 ఎర్రచందనం దుంగల్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యర్రావారిపాళ్యం మండలం తలకోన అడవుల్లో భాకరాపేట అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా 23 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. వీరందరూ సమీప అడవిలోకి పారిపోగా ఒక స్మగ్లర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
శేషాచలం అడవులలో 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం
TAGGED:
chittore district crime