చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాలెం సమీపంలో స్వర్ణముఖి వాగులో ఈతకు వెళ్లి గల్లంతైన వారిలో గుడిమల్లం వద్ద ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దొరికిన మృతదేహాలు ధోని, యుగంధర్లవిగా పోలీసులు గుర్తించారు. జి.పాలెం ఎస్సీ కాలనీకి చెందిన ధోని(16), గణేష్(15), యుగంధర్(14)లు ఆదివారం రోజు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా జయ గణేష్ మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి మృతదేహాలు కోసం మొన్నటి నుంచి ఈ రోజు వరకు రేణిగుంట పోలీసులు, రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఈరోజు మృతదేహాలు లభ్యమయ్యాయి.
Deadbodies found: స్వర్ణముఖి నదిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం - DEADBODIES
చిత్తూరు జిల్లాలో ఆదివారం రోజు గల్లంతైన ఇద్దరి మృతదేహాలు గుడిమల్లం వద్ద నేడు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గల్లంతు కాగా.. అదేరోజు ఒకరి మృతదేహం దొరికింది. మరో ఇద్దరి మృతదేహాలు నేడు లభ్యమయ్యాయి.
స్వర్ణముఖి నదిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం