ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం... వ్యక్తి అరెస్ట్​ - red sandals caught in seshachalam forest

శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్​ అధికారుల కూంబింగ్​లో ఓ స్మగ్లర్​ను అరెస్ట్​ చేశారు. మిగతా వారంతా పరారయ్యారు. వదిలేసి వెళ్లిన 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని సిగమాల శ్రీనివాసులు (36) అనే స్మగ్లర్​పై కేసు నమోదు చేశారు.

19 red sandals caught by task force in chittoor district and a person arrested
శేషాచల అడవుల్లో ఎర్రచందనం దుంగలను పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ సిబ్బంది

By

Published : Aug 28, 2020, 11:19 PM IST

చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్​ అధికారులు కూంబింగ్​ కొనసాగుతోంది. నెమళ్ళగుట్ట సమీపంలోని మామిడి తోటలో శుక్రవారం తెల్లవారుజామున కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ టాస్క్​ఫోర్స్​ సిబ్బందికి తారసపడ్డారు. వెంటనే టాస్క్​ఫోర్స్​ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించగా... స్మగ్లర్లు దుంగలను వదిలి వెళ్లిపోయారు. సిబ్బంది అతి కష్టం మీద సిగమాల శ్రీనివాసులు (36) అనే వ్యక్తిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. 19 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై తిరుపతి టాస్క్​ఫోర్స్​ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details