చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో 17 ఏళ్ల బాలిక తమ గ్రామంలోని సమీప బంధువును ప్రేమించింది. అయితే ఆ వ్యక్తి పెళ్లికి నిరాకరించటంతో బాలిక తీవ్ర మనస్థాపం చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ప్రేమించుకున్నారని.. రెండేళ్ల తర్వాత వివాహం చేసుకుంటానని ప్రేమికుడు చెప్పినట్టు బాలిక తల్లి తెలిపింది. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా తమకు ఎవరూ న్యాయం చెయ్యలేదని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య: ప్రేమ విఫలమై.. మనసు భారమై! - latest suicide news in chittor district
తెలిసి.. తెలియని...వయసు.. ప్రేమించింది. నమ్మినవాడే పెళ్లికి నిరాకరించడం.. ఇక చావే..శరణ్యమనుకుంది. బరువెక్కిన గుండెతో.. ఉరి కొయ్యకు వేలాడింది.
17-years-old-girl-commits-suicide