చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం, దోర్నకంబాలలో విషాదం జరిగింది. అక్కా, తమ్ముడు(మునితేజ) మధ్య సెల్ ఫోన్ కోసం చిన్నపాటి గొడవ జరిగింది. సెల్ ఫోన్ కావాలని తండ్రి దగ్గరకు వెళ్లి అడిగాడు. తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన మునితేజ...బెడ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గదిలో నుంచి కుమారుడు ఎంతకూ బయటకు రాకపోవడం వల్ల...తలుపులు బద్దలు కొట్టి చూశాడు తండ్రి. వెంటనే.. చంద్రగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉందని, తిరుపతి రుయాకు తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. మునితేజ చనిపోయాడు.
14 ఏళ్ల బాలుడిని బలిగొన్న సెల్‌ఫోన్ - news on suicides of children in chittore
సెల్‌ఫోన్ ఓ పిల్లాడి ప్రాణం తీసిoది. కరోనా సెలవుల కారణంగా ఇంటికే పరిమితమైన బాలుడు...సెల్ ఫోన్ కోసం మారాం చేశాడు. తన అక్కతో గొడవ పడ్డాడు. ఇదే విషయమై తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా దోర్నకంబాలలో జరిగింది.
సెల్‌ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకున్న మునితేజ