చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు స్మగ్లర్లకు అడ్డాగా మారాయి. అధికార యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ.... నిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతూనే ఉంది. పుత్తూరు, నగరి బైపాస్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తోన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 12 ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలు, మూడు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లలో ఒకరు ఆర్మీలో పనిచేస్తోన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారంతా తమిళనాడులోని తిరువన్నామలైకు చెందినవారని తెలిపారు. వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. స్మగ్లర్లలో ఆర్మీ ఉద్యోగి - Police checking news in seshachalam forest
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పుత్తూరు, నగరి రహదారిపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకోగా.. నిందితుల్లో ఒకరు ఆర్మీలో పని చేస్తున్నట్లు గుర్తించారు.
నగరి బైపాస్ రోడ్డులో 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం