పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడని సోదరుడు మందలించగా... సుధీర్(15) అనే పదవ తరగతి విద్యార్థి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ గ్రామంలో చోటు చేసుకుంది. సుధీర్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటే... గత నెల రోజులుగా తల్లితో పాటు సుధీర్ ఇద్దరు సోదరులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ సుధీర్ పాఠశాలకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేవాడు. ఈ విషయంపై గత రెండు రోజుల క్రితం పాఠశాల ఉపాధ్యాయులు ఇంటికి వచ్చి కారణాలు తెలుసుకొన్నారు. సుధీర్‌ను క్రమం తప్పకుండా రావలసిందిగా సూచించారు. అయినా వినకుండా ఇంట్లోనే ఉండేవాడు. శుక్రవారం సుధీర్ సోదరుడు కాస్త గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన సుధీర్... పాఠశాలకు వెళ్తున్నానంటూ చెప్పి బడికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొన్నాడు. అటుగా వచ్చిన గొర్రెల కాపరులు విషయాన్ని గుర్తించి గ్రామంలో తెలిపారని మృతుని సోదరుడు తెలిపాడు. సమచారం అందుకున్న గంగవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుని మృతదేహాన్ని పంచనామాకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సోదరుడు మందలించాడని... ఆత్మహత్య చేసుకున్నాడు - చిత్తూరులో విద్యార్థి ఆత్మహత్య
తనలా మేస్త్రీ జీవితం గడపకుండా మంచి చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడనుకున్నాడు ఆ సోదరుడు. కాని బడికి వెళ్లకుండా సుధీర్ ఇంట్లోనే కూర్చుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రికి చూస్తే అనారోగ్యం. కుటుంబ పోషణ అంతా ఇద్దరు సోదరుల మీదే భారం పడింది. అలాంటి సమయంలో తన తమ్ముడి బాగు కోసం బడికి వెళ్లమని మందలించాడు. మనస్థాపం చెందిన సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
పదోతరగతి విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య