చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని బసవయ్య పాలెంలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 టన్నుల రేషన్ బియ్యాన్ని శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. బియ్యం సంచులను మార్చి పెద్ద ఎత్తున బియ్యం నిల్వ ఉంచడం గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
100 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు - బసవయ్య పాలెంలో 100 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని బసవయ్య పాలెంలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
100 ration rice siezed in basavayyapalem chittoor district