చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మోరవపల్లిలో 10 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. భాస్కర్ అనే రైతు పొలంలో కొండచిలువ కనిపించింది. దీంతో అక్కడ పని చేస్తున్న కూలీలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పాములు పట్టే రెడ్డప్పను పిలిపించి కొండచిలువను పట్టించారు. పామును దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలివేయటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మొరవపల్లిలో 10 అడుగుల కొండచిలువ హల్చల్ - భారీ కొండచిలువ
చిత్తూరు జిల్లా మోరవపల్లిలో భారీ కొండచిలువ ఆ గ్రామస్తులను హడలెత్తించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.
10-feet-snake-found-in-moravapalli