ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్ రైతు భరోసాకు ఏడాదికి రూ. 5085 కోట్లు - ysr raithu bharosa

రైతు భరోసాకింద రైతులకు చెల్లించే మెుత్తాన్ని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ పథకం కింద ఏడాదికి 5085 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

వైఎస్సార్ రైతు భరోసా

By

Published : Jun 30, 2019, 5:20 AM IST

వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఏటా 5,085 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి 12,500 చొప్పున చెల్లించేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ పథకం ద్వారా 64.05 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి ఈ మెుత్తాన్ని లెక్కించనున్నారు. కానీ కౌలు రైతులకు ఇచ్చే మెుత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. సీఎం ఆమోదానికి ఉంచి ఆయన సూచన మేరకు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

వైఎస్సార్ రైతు భరోసా

ABOUT THE AUTHOR

...view details