'యూత్ ఫర్ ఆంధ్ర' ఆవిష్కరణ..!! - ap govt
యువతను యంగ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడానికి యూత్ ఫర్ ఆంధ్ర యాప్ రూపొందించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమాలపై యాప్ ద్వారా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో 'యూత్ ఫర్ ఆంధ్ర' మొబైల్ యాప్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా యువతను యంగ్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తొలివిడతలో 10 వేల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. నేరుగా ముఖ్యమంత్రితో వీడియోకాన్ఫరెన్స్ చేసేలా యాప్ రూపొందించినట్లు వివరించారు. ఎన్నికల ముందు రాజకీయ వలసలు మామూలేనన్న మంత్రి... మోదీ, కేసీఆర్, జగన్ దుష్ట శక్తులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. తెదేపా నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.