అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న విజయవాడ న్యాక్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ యోగా వేడుకలు జరగనున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వేడుకలకు హాజరవుతారు. ఆయుష్ కమిషనర్ పీఏ.శోభ, ఇతర అధికారులు న్యాక్ కల్యాణ మండపాన్ని సందర్శించారు.
సర్వం సిద్ధం... 21న "న్యాక్"లో యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న విజయవాడ న్యాక్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హాజరుకానున్నారు.
యోగా దినోత్సవ వేడుకలు సిద్ధమవుతున్న విజయవాడ