తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. వారితో ఫోన్ లో మాట్లాడారు. గత ఐదేళ్లలో అవినీతి జరిగిదంటూ ముఖ్యమంత్రి జగన్, మంత్రులు మాట్లాడటాన్ని ఖండించారు. కావాలని ఆరోపణలు చేస్తున్నారని తప్ప... ఆ నిందల్లో వాస్తవాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే తెదేపాకు ముఖ్యమని చెప్పారు. అవినీతిని తెదేపాకు అంటించాలని చూస్తే అది వారికే చుట్టుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పార్టీ నేతలు పాటుబడాలని నేతలకు సూచించారు. వైకాపా శ్రేణుల దాడులు, దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని, పార్టీ వారికి వెన్నుదన్నుగా ఉంటుందనే భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
'ఆరోపణలను తిప్పికొట్టండి.. శ్రేణులకు అండగా ఉండండి' - undavalli
తాజా రాజకీయాలపై పార్టీ ముఖ్యులతో.. తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో సమీక్షించారు. వైకాపా శ్రేణుల దాడులు, దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.
Chandrababu