ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తండ్రి అనుమతిస్తే.... కొడుకు నోటీసులా?' - yanamala ramakrishnudu

చంద్రబాబుపై కక్షతోనే ఆయన నివాసానికి నోటీసులిచ్చారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్​ రెడ్డి హయాంలో అనుమతులిచ్చిన ఇంటికి కొడుకు ఎలా నోటీసులు పంపిస్తాడని ప్రశ్నిచారు.

యనమల రామకృష్ణుడు

By

Published : Jun 28, 2019, 1:49 PM IST

యనమల రామకృష్ణుడు

చంద్రబాబు ఉంటున్న నివాసానికి నోటీసులు పంపడంపై యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యే అని మండిపడ్డారు. చంద్రబాబు నివాసముంటున్న భవనం నిర్మించినప్పడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని... అక్రమ కట్టడమైతే అప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.


"భవనం నిర్మించే సమయానికి సీఆర్డీఏ లేదు. అప్పటికి అమరావతి రాజధాని ప్రతిపాదన లేదు. ఈ భవనానికి 2008లో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. రివర్ కన్జర్వేటర్ 2012లో అనుమతి ఇచ్చారు." - యనమల


చంద్రబాబుపై కక్షతోనే నదికి 130మీ. దూరంలో ఉన్న ప్రజావేదికను కూలగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసానికే నోటీసులు అంటించారన్నారు. కూలగొట్డడం, విధ్వంసం చేయడం, భయోత్పాతం సృష్టించడమే జగన్ దినచర్య అని యనమల విమర్శించారు. బెదిరించడం, దాడులు చేయడం,దౌర్జన్యాలు జరిపించడం జగన్ నిత్యకృత్యాలని విమర్శించారు. చంద్రబాబు నిర్మాణానికి కృషి చేస్తే, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నారని... ఈ దుందుడుకు చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని కోరాకు.

ఇదీ చదవండి...చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details