ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలు ముగిశాయి...మరీ ఈవీఎంల, వీవీప్యాట్ల సంగతేంటీ..? - election-2019

ఎన్నికలు ముగిశాయి. ఫలితాల వెల్లడితో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. దేశ వ్యాప్తంగా  కోట్లాది  ఓట్లు నమోదు చేసిన ఈవీఎంలు ఇప్పుడు ఏం కానున్నాయి? అందులోని ఓట్లు ఏమవుతాయి? అధికారులు ఈవీఎంలను ఏం చేయబోతున్నారు? ఎక్కడ ఎలా భద్రపరుస్తారు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే. ప్రస్తుత కథనం.

ఈవీఎంల, వీవీప్యాట్ల సంగతేంటీ..?

By

Published : May 26, 2019, 7:41 AM IST

Updated : May 26, 2019, 2:38 PM IST


దేశంలో కోట్లకు పైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఓట్ల ప్రక్రియ ముగియటమే కాదు ప్రభుత్వాలూ కొలువుదీరబోతున్నాయి. మరి.. ఓటింగ్ ప్రక్రియకు వినియోగించిన లక్షలాది ఈవీఎంల పరిస్థితి ఏంటన్న విషయం.. చాలామందిని ఆలోచింపజేస్తోంది. ఈ విషయంలో పీజీలు, డిగ్రీలు చేసిన వారికీ స్పష్టత లేదు.
ఫలితాల వెల్లడి తర్వాత ఈవీఎంలు ఎక్కడికి..?
ఫలితాలు వెల్లడించిన తర్వాత ఈవీఎంలను జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాలు లేదా జిల్లా గిడ్డంగులకు తరలిస్తారు. ఎలక్షన్ పిటిషన్ పిరియడ్ గా పేర్కొనే 45 రోజుల పాటు అదే గిడ్డంగిలో వాటిని భద్రపరుస్తారు. అభ్యర్థి ఎన్నికపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 45 రోజుల్లోగా ఎలక్షన్ పిటిషన్​ దాఖలు చేసే అవకాశముంది. ఈ మేరకు ఈవీఎంలలోని వివరాల్లో తేడా రాకుండా.. డేటా పోకుండా సీల్ చేసి ఉంచుతారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ తో పాటు వీవీ ప్యాట్ ను కూడా అదే తరహాలో సీల్ చేసి ఉంచుతారు. ఈవీఎంలు ఉంచిన గిడ్డంగికి నాలుగు వైపులా ఎలాంటి కిటికీలు, ద్వారాలు లేకుండా పూర్తిగా గోడకట్టేసి సీల్ చేస్తుంది ఎన్నికల సంఘం. విద్యుత్ వైర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
గడవు ముగిసిన తర్వాత..
45 రోజుల పిటిషన్ పిరియడ్ తర్వాత రాష్ట్రంలోని ప్రధాన గిడ్డంగికి లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికలకు అవసరమైన చోటుకు పూర్తి భద్రత మధ్య తరలిస్తారు. ఈసీ ఇంజినీర్లు వివిధ దశల్లో వీటిని తనిఖీ చేసి ఈవీఎంలలో నమోదు అయిన ఓట్లన్నీ తొలగించిన తర్వాత తిరిగి ఎన్నికలకు సిద్ధం అవుతాయి.
వీవీ ప్యాట్లు సంగతేంటి..?
ఇక వీవీ ప్యాట్ లో ప్రింట్ అయిన స్లిప్పు జీవిత కాలం ఐదేళ్లు. వీవీ ప్యాట్ పై ముద్రితమైన వివరాలు ఐదేళ్లపాటు ఉండేలా అందులోని పేపరు ,ఇంకును రూపోందించారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాతిపదికన లెక్కించిన ఐదు శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను కట్టలుగా కట్టి భద్రపరుస్తారు.

ఈవీఎంల, వీవీప్యాట్ల సంగతేంటీ..?
Last Updated : May 26, 2019, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details