ఆయన మాట్లాడితే..మాకు మళ్లీ అవకాశం ఇవ్వాలి: జగన్ - అసెంబ్లీ
బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి ఆఖరిగా సమాధానం ఇస్తారని ముఖ్యమత్రి జగన్ అన్నారు. మళ్లీ చంద్రబాబు మాట్లాడాలంటూ అడగడం విచిత్రంగా ఉందన్నారు. ఎక్కడా ఎప్పుడు చూడలేదని విమర్శించారు.

war_between_jagan_and_chandrabu_in_assembly
బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి క్లారిఫికేషన్ ఇస్తారని...ఆ తర్వాత మళ్లీ ప్రతిపక్షనాయకుడు మాట్లాడటం ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఒకవేళ ఈ ప్రక్రియను మీరు మార్చి వారిని మాట్లాడనిస్తే... మళ్లీ తమకు అవకాశమివ్వాలని స్పీకర్ను సీఎం కోరారు. అంతకుముందు అడుగడుగునా విమర్శలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. జగన్కు సభా సంప్రదాయాలు తెలియవేమోనని విమర్శించారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
ఆయన మాట్లాడితే..మళ్లీ మాకు అవకాశం ఇవ్వాలి: జగన్
Last Updated : Jul 17, 2019, 4:16 PM IST