'విశాఖ రేవ్ పార్టీ వెనుక.. మంత్రి హస్తం' - undefined
ప్రకృతి అందాలతో సుందరంగా ఉండే విశాఖలో విష సంస్కృతిని పెంచుతున్నారని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఎన్నికల ముగిసిన తర్వాత విశాఖలో రేవ్ పార్టీ నిర్వహించారని, దాని వెనుక ఓ మంత్రి హస్తం ఉందని, అధికారులపై ఒత్తిడి చేసి తగిన అనుమతులు పొందారని విమర్శించారు.
ఉక్కునగరం విశాఖను విష సంస్కృతికి కేంద్రంగా మారుస్తున్నారంటూ భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, హోంశాఖ కార్యదర్శులతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం విశాఖలో జరిగిన రేవ్ పార్టీ వెనుక ఓ మంత్రి హస్తం ఉందని ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉన్నప్పుడు బీచ్లో మద్యం తాగేందుకు అనుమతి ఇవ్వకూడదని.. కానీ అధికారులపై ఒత్తిడి చేసి అనుమతులు తీసుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విశాఖలో రేవ్ పార్టీ నిర్వహణపై పవన్ కల్యాణ్, వైసీపీలు కూడా స్పందించాలన్నారు.