గ్రామవాలంటీర్ల నియామకానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి జులై 5 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. జులై 10 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. జులై 11 నుంచి 25 వరకు అభ్యర్థులతో ఎంపిక కమిటీలు ముఖాముఖి నిర్వహించనున్నాయి. ఎంపికైన వాలంటీర్లకు ఆగస్టు 1న నియామక పత్రాలు అందజేసి.. అదే నెల 5 నుంచి 10 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల - గ్రామ వలంటీర్లు
గ్రామవాలంటీర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి జులై 5 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.
'గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల'
ఈ మేరకు http://gramavolunteer.ap.gov.in పేరుతో ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనే వాలంటీర్ల దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పట్టణాల్లో డిగ్రీ... గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదోతరగతి అర్హతగా నిర్ణయించారు.18–35 మధ్య వయస్సు ఉన్నవారే గ్రామవాలంటీర్‌కు అర్హులు.