ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల సంఘానికి వైకాపా నేతల ఫిర్యాదు

ఈవీఎంల భద్రత దృష్ట్యా రాష్ట్రానికి అదనపు బలగాలు పంపాలని వైకాపా నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఈసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్​ని కలిసిన వైకాపా నేతలు

By

Published : Apr 16, 2019, 2:38 AM IST

Updated : Apr 16, 2019, 9:02 AM IST

కేంద్ర ఎన్నికల కమిషనర్​ను కలిసిన వైకాపా నేతలు

ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైకాపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవీఎంల భద్రత దృష్ట్యా రాష్ట్రానికి అదనపు బలగాలు పంపాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు, ఆశా వర్కర్లకు పోస్టల్​ బ్యాలెట్​ అవకాశం కల్పించాలని కోరినట్లు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయనగరం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల సమస్య ఉందని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. మచిలీపట్నంలోని ఈవీఎం స్ట్రాంగ్​రూం లోపలి దృశ్యాలు బయటకొచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో నారాయణ, చైతన్య సంస్థల సిబ్బంది ఉన్నందున.. వైకాపా ప్రయోజనాలకు భంగం కలిగిందని ఆరోపించారు.

Last Updated : Apr 16, 2019, 9:02 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details