'తాజ్‌మహల్ కృష్ణానది పక్కన ఉండుంటే..! నాని వ్యంగ్యాస్త్రాలు' - kesineni nani Prajavedika
మొన్నటికి మొన్న ప్రజావేదిక కూల్చివేత ఆలోచన తప్పు పట్టిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.... మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజ్‌మహల్‌తో లింకు పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
ప్రజావేదిక కూల్చివేతపై కేశినేని వ్యంగ్యాస్త్రాలు
సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య యాక్టీవ్‌గా కనిపిస్తున్న విజయవాడ ఎంపీ... ప్రజావేదిక కూల్చివేత అంశంపై విమర్శలు గుప్పించారు. తాజ్ మహల్... ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయిందని... లేకుంటే ఏమయ్యేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే మాత్రం ప్రజావేదికలా నేలమట్టమయ్యేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి సంబంధించిన ఫొటోలనూ తన పోస్టులో పెట్టారాయన.