ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"చంద్రబాబు ఇల్లు కూల్చక తప్పదు" - vijayasai reddy comments on chandrababu naidu

తెదేపా అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమ కట్టమేనని రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఆ ఇంటిని కూల్చక తప్పదని ఆయన ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

"చంద్రబాబు ఇల్లు కూల్చక తప్పదు"

By

Published : Jun 27, 2019, 3:23 PM IST

లింగంనేని ఎస్టేట్ నుంచి చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలని వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సూచించారు. వైఎస్‌ హయాంలో కట్టారనే వ్యాఖ్యలతో తప్పించుకోలేరన్నారు. ట్విట్టర్​ వేదికగా విజయ సాయిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. నదీగర్భంలోని అక్రమ నిర్మాణమైన ఆ భవనాన్ని కూల్చడం తప్ప మరో పరిష్కారం లేదని తెలిపారు. ప్రజావేదిక అనేది రేకుల షెడ్డులా కనిపిస్తోందని చెప్పారు. సినిమా సెట్టింగుల్లో వాడే పీవోపీనే ఎక్కువ వాడినట్లు కనిపిస్తోందని తెలిపారు. రూ.కోటి ఖర్చయ్యే నిర్మాణానికి రూ.9 కోట్లు ఖర్చు చూపించారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కట్టినవన్నీ ఇలాగే ఉంటాయి అనిపిస్తోందన్నారు. ప్రజావేదిక కూల్చివేత చూసేందుకు అనేకమంది ప్రజలు వచ్చారని గుర్తు చేశారు. వారికున్న అవగాహన కూడా తెదేపా నేతలకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించారని ప్రజలు అంటున్నార, ప్రజావేదికను ఆ భూముల్లోనే కడితే బాగుండేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలా చేస్తే ప్రజాధనం వృథా అయ్యుండేది కాదు కదా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details