దేవాదయ శాఖా మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల్లో అర్చకులకు 25 శాతం పారితోషికం పెంచుతూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. అర్హులైన అర్చకులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన దేవదాయ భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి వెల్లడించారు. దేవదాయ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
అర్చకుల పారితోషకం పెంచుతూ తొలి సంతకం..! - AMARAVTHI
దేవదాయ శాఖామంత్రిగా వెల్లంప్లలి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆలయాల్లో అర్చకులకు 25శాతం పారితోషికం పెంచుతూ మంత్రిగా మొదటి సంతకం చేశారు.
'దేవాదాయ శాఖామంత్రిగా వెల్లంపల్లి బాధ్యతలు స్వీకరణ'
Last Updated : Jun 21, 2019, 3:24 PM IST