తెదేపా నేత వర్ల రామయ్య ఈసీ పై మండిపడ్డారు. సీఈసీ తన పరిధి దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొన్ని పార్టీలపై కర్రపెత్తనం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఈసీని ఎవరు ప్రభవితం చేస్తున్నారో తెలియాలని నిలదీశారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు ఇస్తూనేఎప్పుడు చర్యలు తీసుకుంటుందో ఎలా చెప్తున్నారో తెలియాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో గవర్నర్‌కు దిల్లీలో పనేంటని ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మలా మారిందన్నారు. ఈసీ పరిధిలో లేని ఇంటెలిజెన్స్ డీజీని ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని వర్ల రామయ్య నిలదీశారు.