ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారికి వారే సాటి... ఈ 'వసుంధర'లు మేటి - ramoji groups

జన్మనివ్వటమే కాదు... బతుకునివ్వటమూ తెలుసు. ఆకలి తీర్చటం నుంచి అంతరిక్షంపై కాలుమోపటమూ వారికి అలవోకే. వంట గదిలో గరిట పట్టే వారికి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ పతాకాన్ని ఎగరేసే శక్తి వారి సొంతం. అన్ని రంగాల్లో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు మన నారీమణులు. ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహిళలను ఈనాడు వసుంధర... 'వసుంధర పురస్కారం'తో సత్కరించింది.

వారికి వారే సాటి

By

Published : Mar 9, 2019, 9:38 AM IST

వ్యక్తిగత జీవితం నుంచి మొదలు... వృత్తి, వ్యాపార, రాజకీయ, సినిమా... ఇలా ఎన్నో రంగాల్లో విజయాలు అందుకున్న సబలల కథనాలతో మరేందరిలోనో స్ఫూర్తి నింపుతోంది ఈనాడు వసుంధర. వనితల ప్రతిభ పాఠవాలకు అక్షర రూపం ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఈనాడు మానస పుత్రిక... తొలిసారిగా వసుంధర పురస్కారాలతో విజయలక్ష్మిలను సత్కరించింది. సినిమా, క్రీడలు, వ్యాపారం, టీవీ, సంగీతం ఇలా 9 రంగాల్లో మేటిగా నిలిచిన తెలుగు ఆడపడుచులను అవార్డులతో గౌరవించింది...

వారికి వారే సాటి

క్రీడల్లోనూ మేమే...!
వసుంధర పురస్కరాల్లో భాగంగా యువ విజేతలుగా...చైనా సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సాధించిన ఫరీహ తఫిమ్, ఎవరెస్ట్‌ శిఖరాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, క్రీడల్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్​ తరఫున వారి తల్లిదండ్రులు అవార్డులు అందుకున్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని ఎవరెస్ట్​ ఎక్కి నిరూపించానని తెలిపింది మలావత్ ​పూర్ణ...
వ్యవసాయ, వైద్య, వాణిజ్య రంగాల్లోనూ...
రైతుల కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ రూపొందించిన జయ నల్లబోతుల, వాణిజ్య రంగంలో తనదైన ప్రతిభ కనబరుస్తున్న బిందు కునాటిని వసుంధర పురస్కారంతో సత్కరించారు. వైద్యరంగంలో గ్రామీణ స్థాయిలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ పద్మావతి, డాక్టర్ వెంకట కామేశ్వరీతో పాటు సామాజిక సేవారంగంలో కీలక పాత్రపోషిస్తున్న ప్రసన్న శ్రీ, మమతా రఘువీర్‌లకు శైలజా కిరణ్ అవార్డులను ప్రదానం చేశారు.
రక్షణ నుంచి రంగుల లోకం దాకా...
మహిళల భద్రతకు కృషిచేస్తున్న ఐజీ స్వాతిలక్రా...స్త్రీల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ మహిళా విభాగం అధిపతి సరితను వసుంధర పురస్కారంతో సత్కరించారు. సినిమా, టీవీ రంగాల్లో తమదైన ముద్రవేసిన మహిళమణులు స్వప్నాదత్, నందిని రెడ్డి, హరిత, శ్రీదీప్తి రెడ్డి, శ్రేష్ఠ, మంగ్లీ వసుంధర అవార్డు అందుకున్నారు.
ప్రతిభకు పురస్కారం...
ఇది ఆరంభమని...మహిళామణుల ప్రతిభకు ఇక నుంచి ఏటా గుర్తింపునిస్తూ...వసుంధర పురస్కారాలతో సత్కరిస్తామని ఈటీవీ భారత్​ ఎండీ బృహతి స్పష్టం చేశారు. అవార్డు గ్రహీతలు తమ సందేశాలతో స్ఫూర్తి నింపారు. కార్యక్రమంలో ప్రదర్శించిన సంస్కృతిక నృత్యాలు అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details