ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్ర బడ్జెట్​ నిరాశపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి - Union budget disappointing: MP Vijayasaray Reddy

కేంద్ర బడ్జెట్​లో ఏపీకి నిరాశే మిగిలిందని, ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు.

Union budget disappointing: MP Vijayasaray Reddy

By

Published : Jul 5, 2019, 4:20 PM IST

Updated : Jul 5, 2019, 4:59 PM IST

కేంద్ర బడ్జెట్ పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మొండిచేయి చూపిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా తో పాటు అమరావతి, పోలవవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్​తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని ....రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్​ నిరాశపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి
Last Updated : Jul 5, 2019, 4:59 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details