ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలోకి ఉగ్రనరసింహారెడ్డి - ugra narasimhareddy

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి.. అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.

Ugranarasimha reddy joins in TDP

By

Published : Mar 2, 2019, 9:10 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి.. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో పాటు.. కరణం బలరాం, ఆలపాటి రాజా, దేవినేని అవినాష్ హాజరయ్యారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి బాగా వెనుకబడిన ప్రాంతమని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఆ ప్రాంతం నుంచి వలసలు ఉండవని భరోసా ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే వర్షాకాలం లోగా వెలుగొండ ద్వారా ప్రకాశం జిల్లాకు నీరు వస్తుందన్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీఎం చెప్పారు. కనిగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్న చంద్రబాబు... రామాయపట్నం పోర్టుకు ఇప్పటికే భూమిపూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కనిగిరికి ఐఐఐటీ, వెటర్నరీ కళాశాల ఇచ్చామనీ.. ఫ్లోరైడ్ బాధితులకు పింఛను ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. కనిగిరిని పారిశ్రామికవాడ చేసే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు.

కేంద్రం అమలు చేసిన నోట్ల రద్దుతో ఎవరికీ లాభం కలగలేదని.. వెంటనే 2 వేలు, 5 వందల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబుడిమాండ్ చేశారు. వైకాపా అధినేతజగన్​ను కాపాడుతోంది ఎవరని ప్రశ్నించారు. ప్రధాని మోదీ విశాఖలో మాట్లాడిన తీరు బాగాలేదన్న చంద్రబాబు... తనది యూ టర్న్ కాదని.. ఎప్పుడూ రైట్ టర్న్ అని స్పష్టం చేశారు. జగన్​కు తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తెదేపాకు సేవలందించే కార్యాలయంపై దాడులు చేయడం సరికాదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా... అభివృద్ధి కార్యక్రమాలే తెదేపాను గెలిపిస్తాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details