కేడర్‌లో మనోధైర్యం నింపండి:తెతెదేపా నేతలతో చంద్రబాబు - ttdp
తెలంగాణ తెదేపా నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించారు.
కేడర్‌లో మనోధైర్యం నింపండి:తెతెదేపా నేతలతో చంద్రబాబు
హైదరాబాద్లో ఉన్న తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును.. ఆ పార్టీ తెలంగాణ నేతలు కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నాయకులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. కేడర్ లో మనో ధైర్యం నింపాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని నేతలకు సూచించారు.