ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన తితిదే చైర్మన్ - తితిదే ఛైర్మన్
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పనుల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న శ్రీనివాసుడి ఆలయ నిర్మాణ పనుల గురించి తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. 150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో మూడు ప్రాంతాల్లో ఆకృతులకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు చీఫ్ ఇంజనీరు చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. ఆలయ పునాదులకు సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతోందని ఆయన తెలిపారు.