తెదేపా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు - మంత్రి యనమల
సార్వత్రిక ఎన్నికలకు తెదేపా సిద్ధమైంది. మేనిఫెస్టో ఖరారు చేసేందుకు.. మంత్రి యనమల నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది.
మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 15 సభ్యులతో తెదేపా ఎన్నికల ప్రణాళిక కమిటీ ఏర్పాటైంది. మంత్రులు కాలవ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, ఆనంద్‌బాబు, ఫరూక్, కిడారి శ్రావణ్‌తో పాటు డొక్కా మాణిక్యవరప్రసాద్, నిమ్మల రామానాయుడు, వాసుపల్లి, భూమా బ్రహ్మానంద రెడ్డి, కుటుంబరావు, పంచుమర్తి అనురాధ, స్వాతి రాణి, కృష్ణయ్యను సభ్యులుగా నియమించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చే హామీల రూపకల్పన ఈ కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది. త్వరలోనే సమావేశం జరగనుంది. సంక్షేమానికి పెద్ద పీట వేసేలా ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేయనుంది తెదేపా. రైతు, మహిళ, యువతకు పెద్ద పీట వేసే దిశగా అమలు చేయబోయే కార్యక్రమాలను రూపొందించనుంది.