ఓట్ల కౌంటింగ్‌కు అధికారులకు శిక్షణ తప్పనిసరి అని ద్వివేది తెలిపారు. ఆర్వోలు, ఏఆర్వోలకు నియోజకవర్గ స్థాయిలో పాలనాధికారుల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని, కౌంటింగ్ సిబ్బందికి 24 గంటల ముందు మాత్రమే నియోజకవర్గం కేటాయించాలని ద్వివేది సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ద్వివేది కోరారు.
ప్రతి రౌండ్లో ఏజెంట్లకు చూపించి సంతకాలు తీసుకోవాలని.. పరిశీలకులు తప్ప కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్లు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌రూంల భద్రతపై వస్తున్న ఫిర్యాదులు 99 శాతం నిజం కాదని, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.