30న విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - indiragandhi stadium
రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడ ముస్తాబవుతోంది. ఏర్పాట్లు శర వేగంగా పూర్తవుతున్నాయి. పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుండగా.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ఉన్నతాధికారులు నగరంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు.
డ్రోన్ కెమెరాలు.. సీసీ కెమెరాలు.. 12 వందల మంది సిబ్బందితో.. విజయవాడ ట్రాఫిక్ సిబ్బంది సర్వ సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30న.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. నగరవాసులకు ఇబ్బంది కలగకుండా.. ట్రాఫిక్‌ను మళ్లించేందుకు రూట్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే.. నగరం మీదుగా రాకపోకలు చేసే వాహనాలు మళ్లించేందుకు తగిన ప్రణాళిక రూపొందించారు. గురువారం జరిగే జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బుధవారం రాత్రి నుంచే భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. మరిన్ని వివరాలపై.. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ రవిశంకర్ రెడ్డితో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.