పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో చాలా వనరులున్నాయని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. టూరిజం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకం అభివృద్ధి ద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా పెరుగుతుందన్నారు. 13 జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో శిల్పారామం నిర్మిస్తామని తెలిపారు.
అమరావతిలో శిల్పారామం నిర్మిస్తాం: మంత్రి అవంతి - అమరావతి
గత ప్రభుత్వంలో టూరిజం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక పెట్టుబడులకు స్వర్గధామగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.
tourism minister_spoke_about_andhrapradesh_tourism
టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతులిప్పిస్తామన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతికి 1000 కోట్లు ఇస్తామని చెప్పి 220 కోట్లు మాత్రమే గతంలో ఇచ్చారని.. ఆ నిధులు యువజన సర్వీసుల శాఖకు మళ్లించారన్నారు.