ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో మొత్తం ఓటర్లు 3,93,12,192 - గోపాలకృష్ణ ద్వివేది

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది.

గోపాలకృష్ణ ద్వివేది

By

Published : Mar 26, 2019, 2:18 AM IST

Updated : Mar 26, 2019, 2:32 AM IST

గోపాలకృష్ణ ద్వివేది
రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 3 కోట్ల 93 లక్షల పై చిలుకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. 2019 జనవరి 11న విడుదల చేసిన జాబితా తర్వాత కొత్తగా 25 లక్షల 20 వేల మంది కొత్తగా ఓటర్లు ఈ జాబితాకు వచ్చి చేరారు. ఏప్రిల్ 5 తేదీనాటికి , కొత్త ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 3 కోట్ల 93 లక్షల 12 వేల మందిగా ఎన్నికల సంఘం తేల్చింది. జనవరి 11 తర్వాత రాష్ట్రంలో కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 25 లక్షల 20 వేల మందిగా ఈసీ స్పష్టం చేసింది. మార్చి 20 తేదీనే ఓట్ల తొలగింపు ప్రక్రియ ముగిసిందని మొత్తం 1 లక్షా 41 వేల ఓట్లను మాత్రమే తొలగించామని తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 1 తేదీన విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా తర్వాత ఈ ఆరునెలల్లో రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగారని వివరించారు. మరోవైపు 18 తేదీతో మొదలైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిందని ద్వివేది తెలిపారు. 26 తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొదలు అవుతుందన్నారు. నామినేషన్ల పరిశీలనలో కేంద్రం నుంచి వచ్చిన అబ్జర్వర్లు కూడా పాల్గొంటారని, వీడియో రికార్డింగు కూడా చేయనున్నట్టు తెలిపారు. రాజకీయ పార్టీలు తుదిగా అభ్యర్ధులకు జారీ చేసిన బీ-ఫాంనే ఈసీ పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 55 కోట్ల నగదు, 91 కేజీల బంగారం, 230 కేజీల వెండి, 120 వాహనాలు స్వాధీనం అయ్యాయని ద్వివేది తెలిపారు. 12 కోట్ల విలువ చేసే 2.5 లక్షల లీటర్ల మద్యం దొరికిందన్నారు. 6 కోట్ల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ద్వివేది వెల్లడించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ పార్టీలకు 367 నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. తెదేపాకు 125, వైకాపాకు142, జనసేన 42, బీజేపీ 15 నోటీసులు జారీ చేశామన్నారు.
Last Updated : Mar 26, 2019, 2:32 AM IST

ABOUT THE AUTHOR

...view details