విద్యాకేంద్రం అమరావతి - amamrawathi
రాజధాని అంటే కేవలం పరిపాలనకే కాదు పారిశ్రామికంగా, విద్యాపరంగా ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడకు రావాల్సిన అవసరముందని గుర్తించిన ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తోంది. భావితరాల అవసరాలకు సరిపోయే చదువుల్ని యువతకు అందించాలన్న లక్ష్యంతో విద్యాలయాలను ఇక్కడకు తీసుకొచ్చింది.
పచ్చని ప్రకృతి మధ్య విశాలమైన క్యాంపస్ లు.... మారుతున్న అవసరాలకు తగ్గట్లుగా విద్యా ప్రణాళిక... ప్రపంచంతో పోటీ పడేలా చదువులు.... నవ్యాంధ్రకు మణిహారంగా మారుతున్న అమరావతి ప్రాంతంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకోవాల్సిన మాటలివి. రాజధాని అంటే కేవలం పరిపాలనకే కాదు పారిశ్రామికంగా, విద్యాపరంగా ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడకు రావాల్సిన అవసరముందని గుర్తించిన ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తోంది. భావితరాల అవసరాలకు సరిపోయే చదువుల్ని యువతకు అందించాలన్న లక్ష్యంతో విద్యాలయాలను ఇక్కడకు తీసుకొచ్చింది.
దేశంలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పేరొందిన అమృత యూనివర్శిటి అమరావతిలో ఏర్పాటవుతోంది. ప్రస్తుతం భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. యుజీసి అనుమతులు రాగానే విశ్వవిద్యాలయం కార్యకలాపాలు మొదలు పెట్టనుంది.
దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూలు జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇనిస్టిట్యూట్ ఎక్స్ LRI కి కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 50 ఎకరాల్లో నిర్మించనున్న ఈ క్యాంపస్ వచ్చే ఏడాదికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొని తరగతులు ప్రారంభించనుంది. అలాగే యుకెకు చెందిన బి.ఆర్.శెట్టి సంస్థ అమరావతి ప్రాంతంలో వైద్య కళాశాల, పరిశోధనా సంస్థ, ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన పనులు ప్రారంభం కావాల్సి ఉంది.