నేడు విశాఖ, విజయనగర జిల్లాలో సీఎం పర్యటన - millinium towers
నేడు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు ముఖ్యమంత్రి చేరుకుంటారు.
విశాఖ, విజయనగరం జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ రెండు జిల్లాల్లో భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు చేయాలని సీఎం నిర్ణయించారు. నేటి ఉదయం అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ పూర్తయిన తర్వాత 10.15గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. అనంతరం హెలీకాప్టర్ లో విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం చేరుకుంటారు.
నేడు సీఎం హాజరయ్యే కార్యక్రమాలు:
శంకుస్థాపనలు
1. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి
2. విజయనగరం జిల్లా భోగాపురం హరిత మైదాన విమానశ్రయం
3. గజపతి నగరం శ్రీ చంద్రన్న పుడ్ పార్క్
4. కొత్త వలస పతంజలి ఫుడ్ పార్క్
5. ఎస్ కోట రేగలో ఆరోగ్య మిల్లెట్ ప్రాసెంసిగ్ యూనిట్
6. విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల
7. విజయనగరం గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయం
(అనంతరం అక్కడి బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడకు హెలికాప్టర్లో చేరుకుంటారు.)
8. మధురవాడలో మిలీనియం టవర్స్ ప్రారంభోత్సవం
9. కాపులుప్పాడలో అదానీ డేటా సెంటర్
10. అబ్దుల్ కలాం కల్చరల్ సెంటర్
11. ఎలీప్ పారిశ్రామిక వాడ
12. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
13. గాజువాక, మల్కాపురం ప్రాంతాలకు మురుగు సేకరించే కన్వేయర్ బెల్ట్
14. పాండ్రంగి వంతెన
15. తాటిలూరు కాజ్ వే నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి విశాఖ నుంచి విజయవాడకు పయనమవుతారు.