రాజ్యాంగ హక్కును కాలరాస్తున్న వైకాపా రౌడీలు: నారా లోకేశ్ - మంత్రి లోకేశ్
ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు... దాన్ని వైకాపా రౌడీలు కాలరాస్తున్నారు. -ట్విట్టర్లో మంత్రి లోకేశ్

నారా లోకేశ్
కర్నూలు జిల్లా మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరవేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో తిక్కారెడ్డితోపాటు మరో ఏఎస్ఐ గాయపడ్డారు.ఈ ఘటనపై స్పందించిన లోకేశ్ ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని వ్యాఖ్యనించారు. దాన్ని వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
Last Updated : Mar 16, 2019, 8:00 PM IST