పిడుగులు పడొచ్చు.. జాగ్రత్తగా ఉండండి! - rtgs
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు మరో హెచ్చరిక. మారుతున్న వాతావరణం ప్రకారం... రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పిడుగుపాటుకు అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ , మంగళగిరి, గుంటూరు, తాడేపల్లి, దుగ్గిరాల , తెనాలి, ప్రత్తిపాడుతో పాటు... కృష్ణా జిల్లా బాపుల పాడు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ, నందిగామ, కంకిపాడులో పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రకటించింది. అలాగే.. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, బుట్టాయగూడెం, వేలేరుపాడు.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, రంపచోడవరం, వై.రామవరం... విశాఖ జిల్లా కొయ్యూరు, అరకు, అనంతగిరి.. విజయనగరం జిల్లా పాచిపెంట.. చిత్తూరు జిల్లా కుప్పం, మదనపల్లె, పుంగనూరు, గుడిపల్లెలో పిడుగులు పడొచ్చని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.