పిడుగుపాటు హెచ్చరిక
ఉత్తరాంధ్రలో ఈ సాయంత్రం పిడుగులు పడే ప్రమాదం ఉందని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ హెచ్చరించింది. ప్రజలు మైదానాలలో, చెట్ల కింద ఉండొద్దని.. పొలం పనులకు వెళ్లకూడదని.. పశువులు, గొర్రెల కాపరులు సరక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో ఇవాళ సాయంత్రం పిడుగులు పడే ప్రమాదం ఉందని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట, ఎల్.ఎన్.పేట, మెళియాపుట్టి, సరుబుజ్జిలి, జలుమూరు, పాతపట్నం, సారవకోట, హిరమండలం... విజయనగరం జిల్లా భోగాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా కూనవరం, ఏలేశ్వరం, గంగవరం, అడ్డతీగల... విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలోని ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. మైదానాలలో, చెట్ల కింద ఉండొద్దని.. పొలం పనులకు వెళ్లకూడదని.. పశువులు, గొర్రెల కాపరులు సరక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని స్పష్టం చేసింది.