నవరత్నాల్లో కొన్నింటికి కేటాయింపులే లేవు:తులసిరెడ్డి - undefined
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. అమ్మఒడి పథకంపై స్పష్టత ఇవ్వటంలో విఫలమైందని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నవరత్నాలు నాణ్యత కోల్పోయాయని, సీఎం జగన్ విశ్వసనీయత కోల్పోయారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. నవరత్నాల్లో కొన్నింటికి అసలు కేటాయింపులు లేవన్నారు. మహిళలకు సంబంధించిన ఆసరాకు అన్యాయం జరిగిందని...అభయహస్తానికి కేటాయింపులు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన చేయలేదని..జలయజ్ఞానికి గతంలో కంటే తక్కువ కేటాయించారని, పేదలకు ఇళ్లపై స్పష్టత లేదన్నారు. మద్యపాన నిషేధం అంటూనే మద్యంపై ఆదాయం ఎక్కువగా చూపారని దుయ్యబట్టారు. మాట తప్పడం స్థిరాస్తి అయితే...మడమ తిప్పడం చరాస్తి..ఇదేనా విశ్వసనీయత అంటూ మండిపడ్డారు. పిట్టల దొర, కోతల రాయుడి మాటల్లా బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు.