ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 5, 2019, 9:02 PM IST

ETV Bharat / state

ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు: బుగ్గన

కేంద్ర బడ్జెట్​లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు జరగలేదని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం వంటి అంశాలు ప్రస్తావించపోవటం నిరాశ కలిగించిందన్నారు. గత ప్రభుత్వం చేసిన రుణ భారం రాష్ట్రంపై అధికంగా ఉందన్నారు. ఈ విషయాలన్నిటినీ కేంద్రానికి విన్నవిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు: బుగ్గన

కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్జి స్పందించారు. బడ్జెట్​లోని కేటాయింపులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి, పోలవరం వంటి అంశాలను ప్రస్తావించకపోవటం పై పెదవి విరిచారు.

బడ్డెట్​పై రాష్ట్ర ఆర్థిక మంత్రి స్పందన

రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై ముఖ్యమంత్రి జగన్​ కేంద్రానికి విన్నవించారు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదు. రెవెన్యూ లోటు, ప్రత్యేక హోదా, అమరావతి గురించి ప్రస్తావించలేదు. భాజపా మద్దతుతోనే రాష్ట్రాన్ని వేరు చేశారు. అయినా విభజన అంశాలు విస్మరించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించలేదు. ఒక్క జాతీయ గ్రామీణ నీటి సరాఫరా పథకానికి తప్ప వేరే అంశాలకు చోటులేదు. ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు. గత ప్రభుత్వం చేసిన రుణ భారం రాష్ట్రంపై ఉంది. తెదేపా సర్కార్​ శక్తికి మించి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది. ఏది ఏమైనా..వైకాపా పథకాలు, నవరత్నాలు కొనసాగిస్తాం.
-- బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ఇవీ చదవండి..ప్రజల ఆకాంక్షలకు విరుద్ధం.. కేంద్ర బడ్జెట్: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details