గ్రామ సచివాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు.ఈ నెల22లోగా సిబ్బంది ఎంపిక విధానం ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల23నుంచి సెప్టెంబరు15వరకు ఉద్యోగుల భర్తీ పూర్తి చేయనున్నట్లు అందులో పేర్కొంది.సెప్టెంబరు16 నుంచి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఎంపికైన వారికి శ్రీకాళహస్తి,బాపట్ల,సామర్లకోట కేంద్రాల్లో సెప్టెంబరు28 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. సెప్టెంబరు20నుంచి గ్రామ సచివాలయాలు, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబరు2 నుంచి గ్రామసచివాలయాలు పనిచేయడం ప్రారంభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. సిబ్బంది జాబ్ చార్టును ఆర్టీజీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే ఏర్పాట్లను చేయనుంది.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా సిబ్బంది విధులను నిర్దేశం చేయనున్నారు. సుమారు లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు - jobs
రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సచివాలయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనికనుగుణంగా ఉత్తర్వులను జారీ చేసింది.
జగన్
కమిటీ ఏర్పాటు
గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి విధివిధానాలపై కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహణ, ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా సచివాలయాల ఏర్పాటు, ఎంపికైన వారి తుది జాబితా ఇలా నోటిఫికేషన్ నుంచి అన్ని అంశాలపై ఈ కమిటీ కార్యాచరణ రూపొందించనుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.
Last Updated : Jul 19, 2019, 11:08 PM IST